Monday, October 7, 2024

Yadadri – బస్సు ని ఢీకొన్న కంటైనర్ – ఇద్దరి మృతి

హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని ఎల్లం బావి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుకనుంచి బలంగా ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరు మరణించారు. మరణించిన ప్రయాణికులు ఇద్దరు నిద్రలో ఉన్నారు.కంటైనర్ ఢీకొని…ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మూడు మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

- Advertisement -

మృతదేహాలను చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చనిపోయిన ఇద్దరు ప్రయాణికులు ఖమ్మం జిల్లా ఇల్లందు కు చెందిన సతీష్ కుమార్, తేజ లుగా పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంతోనే కంటైనర్ ఢీకొట్టడం వల్ల ఇంతటి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement