Sunday, December 1, 2024

Yadadriలో రేవంత్ పర్యటన … బి ఆర్ ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు

యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ బి ఆర్ ఎస్ కార్యకర్తలను, నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.. … వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు చిట్యాల మండలాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి.

ఇక అటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అరెస్ట్ అయ్యారు. గతంలో సీఎం ప్రోగ్రాంను అడ్డుకుంటామని హెచ్చరించారు చిరుమర్తి లింగయ్య . ఈ తరుణంలోనే పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేశారు

పోలీసులు. ఇక తన అరెస్ట్ చేయడంపై పోలీసులతో చిరుమర్తి లింగయ్య వాగ్వాదానికి దిగారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేసిన చిరుమర్తి లింగయ్య..పోలీసులపై మండిపడ్డారు.

- Advertisement -

అలాగే, వీటి కాలనీ లోని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నివాసం వద్ద పోలీసుల మొహరించారు. ఆయనను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కూడా పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement