Saturday, December 7, 2024

లైంగికదాడికి పాల్పడ్డాడ‌ని మహిళా నేత ఫిర్యాదు.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అరాచకం ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని పార్టీకి చెందిన మహిళా నేతను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డట్లు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. లైంగిక దాడికి పాల్పడ్డ సదరు నేత వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కోరిక తీర్చకపోతే నెట్‌లో ఫొటోలు పెట్టిస్తా అని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని సదరు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గ్రాండ్‌ కాకతీయ హోటల్‌కు పిలిపించి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని, మెడలో పసుపుతాడు కట్టి కామవాంఛలు తీర్చుకున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తన భార్య ఆరోగ్యం బాగాలేదని ఆమె మూడేళ్ల కంటే ఎక్కువ బతకదంటూ శివకుమార్‌రెడ్డి నమ్మ బలికాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల తనను దూరం పెట్టడంతో పాటు అనుచరుల చేత బెదిరింపులకు గురిచేస్తుండటంతో పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement