Tuesday, October 8, 2024

సీఐడీ డీజీపీ చొరవతో.. ఇటుక బట్టీ కార్మికులకు విముక్తి..

పెద్దపల్లి, మార్చి 18 (ప్రభన్యూస్‌): సీఐడీ డీజీపీ మహేశ్‌ భగవత్‌ చొరవతో ఇటుక బట్టీల కార్మికులకు విముక్తి లభించింది. ట్విట్టర్‌లో చేసిన పోస్టుకు స్పందించిన సీఐడీ డీజీపీ ఆదేశాల మేరకు కరీంనగర్‌ సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో గల ఇటుక బట్టీల్లో నిర్భంధంలో ఉన్న ఒడిశా కార్మికులను వారి స్వస్థలాలకు తరలించారు. ఒడిశా రాష్ట్రంలోని పదంపూర్‌ బొలాంగూర్‌ జిల్లాకు చెందిన గోవర్ధన్‌ నాగ్‌, అతని సతీమణి అహల్య నాగ్‌, వారి పిల్లలు నలుగురితో పాటు సురేంద్ర మాలిక్‌, అతని సతీమణి ఉమావతి మాలిక్‌ గరాలను పెద్దపల్లి పోలీసుల సహకారంతో ఇటుక బట్టీల నుంచి విముక్తి కల్పించారు. బాధితులను వారి వారి స్వస్థలాలకు పంపించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement