Friday, April 26, 2024

అత్యాధునిక హంగులతో.. నిర్మల్ బస్ స్టేషన్ కమర్షియల్ కాంప్లెక్స్

నిర్మల్ టిఎస్ ఆర్టిసి బస్ స్టేషన్ ను మరింత అభివృద్ధి చేసేందుకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్..నిర్మల్ టిఎస్ఆర్టిసి ప్రయాణికుల ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే టిఎస్ ఆర్టిసి కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద సెల్లార్ .. జి – ప్లస్ వన్, శుభకార్యాలకు నిర్వహించే హాల్, లక్ష ఎస్ఎఫ్టి తో నిర్మాణం చేయడం జరుగుతుంది.. టిఎస్ ఆర్టిసి ద్వారా 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్ లలో 53 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని – సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు వెల్లడించారు..కాగా నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో .. బాజిరెడ్డి గోవర్ధన్ రు నిర్మల్ బస్టాండులో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు..బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్టాండులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు..ఈ సమీక్ష సమావేశంలో ఆర్టిసి అధికారులు ఈడిఈ వినోద్ కుమార్ , సిటిఎం విజయ్ కుమార్ , సీసీఈ రాంప్రసాద్, సివిల్ ఇంజనీర్ మహేష్ ఇతర ఆర్టీసీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement