Saturday, November 27, 2021

హన్మకొండలో దారుణ హత్య.. కట్టుకున్న భర్తను చంపిన భార్య

మద్యానికి బానిసైన వేధింపులకు గురి చేస్తున్న భర్తను భార్య హత్య చేసిన సంఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. రెడ్డికాలోనిలో నివాసం ఉంటున్న గన్నేరు శంకర్ అనే వ్యక్తి మద్యానికి బానిసై తరుచూ భార్యతో గన్నేరు సుజాత గొడవ పడుతున్నాడు. దీంతో భర్త వేధింపులు అధికం అవ్వడంతో ఆదివారం రాత్రి సుజాత తన సోదరుడి సహకారంతో భర్త శంకర్ ను రాడ్ తో కొట్టి హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఘటనపై నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News