Monday, October 14, 2024

TG: దొంగ ఏడుపులు, పెడ‌బొబ్బ‌లు ఏంటీ మంత్రి గారు – కేటీఆర్

గ‌తంలో మాపై ట్రోలింగ్ చేయ‌లేదా మీరు
ఎవ‌రో ఏదో చేస్తే మాకేందీ
మీరు బూతులు మాట్లాడినా మౌనంగానే ఉన్నాం
మా ఆడాళ్లు మీ ఆరోప‌ణ‌లకు ఎంత బాధ‌ప‌డ్డారో గుర్తించారా
ఫోన్ ట్యాపింగ్ అంటూ హీరోయిన్స్ పై
మీరు చేసిన‌ ఆరోప‌ణ‌తో వారి ఆవేద‌న విన్నారా
మీ ముఖ్య‌మంత్రి కూడా ఎన్ని బూతులు మాట్లాడారో మీకు తెలుసా
ఆ వీడియోలు మీకు పంపుతాం
ముందు ఫినాయిల్ తో మీ సిఎం, మీ నోళ్లు క‌డుక్కోండి..

హైద‌రాబాద్ – ఎవ‌రో ఏదో సోష‌ల్ మీడియాలో మీ పై పోస్ట్ లు పెడితే మాకేంటీ సంబంధం అంటూ మంత్రి కొండా సురేఖ‌ను నిల‌దీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నేడు కొండా చేసిన ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించిన ఆయ‌న గ‌తంలో మీరూ మాట్లాడిన బూతులు మ‌రిచిపోయారా అంటూ నిల‌దీశారు.. కొండా సురేఖ గారు గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా ? అని ప్ర‌శ్నించారు.. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా ? అంటూ పేర్కొన్నారు.

కొండా సురేఖ గారు మీరు మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే ఒక‌సారి చూడండి అంటూ కౌంట‌ర్ వేశారు. మీరు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారని అంటూ మీరు ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా ? వాళ్లకు మనోభావాలు ఉండవా ? అంటూ సురేఖ‌పై ఫైర్ అయ్యారు..

అలాగే మాపైనా, మా ఇంటిలోని మ‌హిళ‌ల‌పైనా అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా ? వాళ్ళు ఏడ్వరా…? ఇవేం మీకు ప‌ట్టవా అంటూ కేటీఆర్ ప్ర‌శ్న‌లు కురిపించారు.. తాజాగా డ్ర‌గ్స్ అంటూ , రేవ్ పార్టీలంటూ, హీరోయిన్స్ జీవితాలు పాడు చేశారంటూ మీరు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఒక్క‌టైనా నిజం ఉందా అని ప్ర‌శ్నించారు..

- Advertisement -

ఎవ‌రో ఏదో చేస్తే దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి ? అంటూ సురేఖ‌ను అడిగారు.. సోష‌ల్ మీడియాలో మా పార్టీ తరఫున మీ గురించి ఎవరూ మాట్లాడలేద‌ని, అయిన‌ప్ప‌టికీ మా స‌హ‌చ‌రుడు హారీశ్ రావు ఆ ట్రోలింగ్ ను ఖండిస్తూ ఒక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశార‌ని గుర్తు చేశారు.


ఇక మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తాన‌ని, వాటిని చూసి మేం ఎంత బాధ‌ప‌డిఉంటామో ఆలోచించండి అన్నారు. ఇక ఇంత చెత్త‌గా మాట్లాడిన ముఖ్య‌మంత్రి రేవంత్ నోటిని మీరు, మీ స‌హ‌చ‌ర మంత్రులు క‌డిగి ప్ర‌క్షాళన చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు కేటీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement