Thursday, November 7, 2024

TG |లక్ష్మీ బాంబా.. సుతిల్ బాంబా.. తుస్సు బాంబా.. పొంగులేటిని ప్రశ్నించిన కేటీఆర్

పొంగులేటి ఈడీ రైడ్స్ గురించి చెప్తారేమో
ఆదాని కాళ్లు మొక్కింది చెప్తారో
అమృత్ స్కాంపై విచారిస్తారో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


సిరిసిల్ల, ఆంధ్రప్రభ : దీపావళికి ముందే తెలంగాణలో బాంబులు పేలుతాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ… సుతిల్ బాంబులు పేలుతాయా, లక్ష్మీ బాంబులు పేలుతాయా, తుస్సు బాంబులు పేలుతాయో చూడాలన్నారు.

మంత్రి పొంగులేటి తనపై జరిగిన ఈడీ రైడ్స్ లో దొరికిన నోట్ల కట్టలపై చెప్తారో వేచి చూద్దాం అన్నారు. అమృత్ పథకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి రూ.1137 కోట్ల టెండర్ కట్టబెట్టారని తాను ఆరోపించిన అంశంపై విచారణకు ఆదేశిస్తారో చూద్దామన్నారు. లేదా బీజేపీ ఆగ్ర నాయకులను ఎలా ప్రసన్నం చేసుకున్నారో ప్రజలకు చెప్తారని అనుకుంటున్నానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement