Thursday, March 28, 2024

మహిళా ఆరోగ్య క్లినిక్ ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వరంగల్ జిల్లాలో మహిళా ఆరోగ్య క్లినిక్ ను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కీర్తి నగర్ లో వరంగల్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేస్తూ మహిళలకు చేస్తున్న ఆరోగ్య సేవలపై తెలుసుకున్నారు. దీనిపై డాక్టర్ కె.వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మహిళా క్లినిక్ ద్వారా మహిళలకు అందిస్తున్న సేవలు గురించి వివరించి చెప్పడం జరిగినది. మన జిల్లాలో గుర్తింపు పొందిన ఐదు మహిళా క్లినిక్ లలో ప్రతి మంగళవారం మహిళా క్లినిక్ ద్వారా సేవలందిస్తున్నామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయిలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న మహిళలు వైద్య సేవలు పొందుతూ ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని తెలిపినారు మరియు ఎవరికైనా మహిళ క్లినిక్ లో లేని వైద్య సేవలకు మెరుగైన హాస్పిటల్స్ రెఫర్ చేయడం జరుగుతుందని తెలిపినారు అలాగే మన వరంగల్ జిల్లాలో CHC నర్సంపేట ఎంజీఎం వరంగల్ లో సేవలు పొందడానికి అవకాశం ఉందని తెలియజేసినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement