Wednesday, November 6, 2024

WGL: స్నానానికి వెళ్లి.. చలివాగులో ఇద్దరు మృతి..

టేకుమట్ల, అక్టోబర్ 13 (ఆంధ్రప్రభ): భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవ రెడ్డి పేట-టేకుమట్ల చలివాగులో ఆదివారం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మండలంలోని వెలంపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సిబ్బంది సొల్లేటి రాములు (45), గీసా హరీష్ (25) స్నానానికి చలివాగు వద్దకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు మృతిచెందారు. మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనతో ఆ గ్రామంలోని అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. పండుగ తెల్లారే మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement