Saturday, February 4, 2023

ఎమ్మెల్యే వివేకానంద్ కు సంక్షేమ సంఘం స‌భ్యుల స‌న్మానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్లేందుకు పైప్ లైన్ పూర్తి చేసినందుకు గాను ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -
   

అనంతరం కాలనీలో మిగిలిన లైన్లలో సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సుధాకర్ గౌడ్, కృష్ణా గౌడ్, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మల్లేష్, తేజ గౌడ్, పండు, సర్వేశ్వర రావు, రాజు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement