వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోదండరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఏ నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేస్తాం.. ప్రొఫెసర్ కోదండరాం

- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement