Friday, March 29, 2024

మేడారం జాత‌ర‌లో నిరంత‌ర విద్యుత్ అందిస్తాం: ఎన్ పీడీఎల్

ప్ర‌భ‌న్యూస్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందజేస్తామని టిఎస్‌ ఎన్పీడిసీఎల్‌ డైరెక్టర్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. నిన్న‌ మండలంలోని మేడారంలో విద్యుత్‌ పనులను మోహన్‌ రెడ్డి ప్రారంభించారు అనంతరం కొత్తూరు సబ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అతిపెద్ద జాతరకు కోటిన్నర భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా జాతరకు 198 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నమన్నారు. గుడి చుట్టూ ఒక 35 కెవి లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా జాతరకు 70 మంది ఇంజనీర్లు 430 మంది సిబ్బందిని ఉపయోగిం చనున్నట్లు వారన్నారు.

ఈ జాతరలో విద్యు త్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. విద్యుత్‌ అంతరాయం కలిగితే వెంటనే దానిని సరిదిద్దే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు. గోవిందరావుపేట మండలం పస్రా 130 కెవి సబ్‌ స్టేషన్ను ప్రారంభించి ఇక్కడి నుంచి విద్యుత్‌ సరఫరా చెస్తామన్నారు. మేడారం జాతర పనులను జనవరిలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తిసుకవస్తామన్నారు. పస్రా సబ్‌ స్టేషన్‌ నుండి మేడారం తాడువాయి కర్లపల్లి ఎటుర్‌నగారం సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement