Thursday, December 5, 2024

Deputy CM : వ్య‌వ‌సాయాధారిత ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రొత్స‌హిస్తాం..

బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి వెల్ల‌డి
దేశంలోనే శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌రాష్ట్రం తెలంగాణ‌
అన్ని ప్రాంతాల్లో క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తాం…
దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్‌ రాబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తమ మొదటి ప్రాధాన్యమని భట్టి విక్రమార్క వివరించారు.

అయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి… మంత్రి తుమ్మ‌ల
ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్‌ పామ్‌ పండిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని తెలిపారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. బహుళజాతి, ఇన్‌ఫ్రా కంపెనీలకు రూ.వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం ఉండకూడదని చెప్పారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement