Friday, March 29, 2024

చెరువులోకి డ్రైనేజ్ నీరు.. సాల్వ్ చేసేది ఎవ‌రు..

ప్రభ న్యూస్ : సరూర్‌ నగర్‌ చెరువులో డ్రైనేజీ నీరు కలవటంతో దుర్వాసన తో గ్రీన్‌పార్క్‌ కాలనీ ఐఎస్‌సదన్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా చెరువులో డ్రైనేజీ నీరు కలుస్తుందని, వాటిని బందుచేసి చెరువులో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరారు. గతంలో ప్రతినిత్యం చెరువులో క్లీనింగ్‌ చేసేవారని నెల రోజుల నుంచి క్లీనింగ్‌ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎర్ప‌డింద‌ని వారు చెప్పారు. ఒక పక్క డెంగీ, మలేరియా మరో పక్క కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని వారు ఆందోల‌న వ్య‌క్తం చేశారు. వెంటనే ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

మూడు సంవత్సరాల కాంట్రాక్టు పూర్తికావటంతో సమస్యలు పునరావృతం అయ్యాయి. గతంలో సరూర్‌నగర్‌ చెరువులో గుర్రపు డెక్క పెరగడంతోపాటు దుర్వాసనతో దోమల బెడద తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం మూడు సంవత్సరాలు చెరువులో గుర్రపు డెక్క దుర్వాసన లేకుండా కాంట్రాక్ట్‌ ఇవ్వటంతో సమస్య పరిష్కారం అయిందని, కాంట్రాక్ట్‌ పూర్తి కావడంతో సమస్య పునరావృతం అయింది. వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలని గ్రీన్‌పార్క్‌ కాలనీ ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement