Friday, October 4, 2024

Warns – రెచ్చిపోవ‌ద్దు… ఎపి లో అధికారుల‌కు ప‌ట్టిన గ‌తే మీకూ త‌ప్ప‌దు – హ‌రీశ్ రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చ‌రించారు..తెలంగాణ భవన్‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారని,ప్ర‌భుత్వం మారిన వెంట‌నే వారంద‌రేఊ సస్పెండ్‌ అవుతున్నార‌ని ప్ర‌స్తావించారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంద‌న్నారు. త‌మ‌పై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదు” అని గుర్తు చేశారు.

ప్ర‌కృతి తెచ్చిన క‌ర‌వు కాదు…

రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, అది ప్రకృతి తెచ్చిన కరవు కాద‌ని, కాంగ్రెస్ తెచ్చిన కరవ‌ని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా ఉన్నా రైతులకు పూర్తిగా సాగునీరు అందకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా లో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఆ జిల్లాకు ఇలాంటి దుస్థితి రావడం దురదృష్టకరమని తెలిపారు. జిల్లాకు వచ్చే సాగర్ కాలువ కు గండి పడి 22 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ గండిని సరిగా పూడ్చకపోవడం ఏంటని ప్రశ్నించారు. పక్కా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆరోపించారు.

- Advertisement -

సాగునీరు ఇచ్చేందుకు చేతకాదా..

గతేడాది ప్రకృతి తెచ్చిన కరువైతే.. ఈ ఏడాది కాంగ్రెస్ కరువును తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులకు కనీసం సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు. ఓ వైపు నీళ్లు లేక పంటలు ఎండుతుంటే హైదరాబాద్ నగరంలో నిరుపేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే సోయి ఉండాలి కాదా అని ప్రశ్నించారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. సర్కార్ నిర్వాకం వల్లే సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ధ్వజమెత్తారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో పాటే.. సాగర్ ఆయకట్టులో నీరందక పంట ఎండిన పొలాలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement