Monday, April 15, 2024

Breaking: వైఎస్ షర్మిల అరెస్ట్..

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని చెన్నారావుపేట మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. రెండు రోజులుగా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటలు, కొట్లాటలు జరిగాయి. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు చెన్నరావుపేట మండలం లింగగిరి వద్ద అరెస్టు చేసి మహబూబాబాద్ కు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement