Wednesday, March 27, 2024

అగ్నిపథ్ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం : ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

యువతను మోసం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్నిపథ్” పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం వరంగల్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేప‌ట్టారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రభుత్వం “అగ్నిపథ్” పథకంతో దేశ యువత భవిష్యత్ తో ఆటలాడుకుంటుందని, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్న యువకులు గత ఎనమిది సంవత్సరాల బీజేపీ పాలనలో మోసపోతూనే ఉన్నారని ఆరోపించారు. నాలుగు ఏళ్ల‌కే రిటైర్మెంట్ అంటే ఆ తరువాత అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా మాత్రమే పనిచేయుటకు ఈ కాంట్రాక్టు నియామకాలు జరుగుచున్నాయా అని అయన ప్రశ్నించారు. “అగ్నిపథ్” పథకాన్ని తక్షణమే రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. “అగ్నిపథ్” కారణంగా దేశంలో జరుగుతున్న అల్లర్లకు, ఆందోనళకు, ఆర్మీ అభ్యర్థుల మరణాలకు మోడీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా లు బాధ్యత వహించాలన్నారు. గత ఎనమిది సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయలేదని, నిరుద్యోగం పెరుగుదలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే, 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించిందని ఇదికూడా బూటకమేనని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రక్షణ దళాలలో నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ఉద్యోగం యువత జీవితాలను నాశనం చేస్తుందని అయన తెలిపారు. ఏఐవైఎఫ్ ప్రత్యేక్ష పోరాటం చేస్తుందని తెలిపారు.. ఈ కార్యక్రమం లో మస్కా సుదీర్, మేకల ప్రవీణ్, గజ్జెల్లి మార్కండేయ, ఈర్ఫాన్, సందని, శివ, పవన్, ప్రవళిక, రంజిత్, విజయ్, భానుతేజ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement