Monday, January 30, 2023

వరంగల్ బీజేపీకి షాక్.. గులాబీ గూటికి బీజేపీ సీనియర్ నాయకుడు..

  • విశ్చిన్నకర శక్తులను ప్రజలు తిరస్కరిస్తున్నారు..
  • ప్రజల మద్య చిచ్చుపెట్టే పార్టీలకు బుద్ది చెబుదాం..
  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ తూర్పులో బీజేపీకి గట్టి షాక్ తగిలింది.. బీజేపీ అనుసరుస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలు, ప్రజా విశ్చిన్న చేష్టలు నచ్చక బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడు, ఆ పార్టీలో సుదీర్గకాలం సేవలందించిన నాయకుడు కొప్పుల శ్రీను వారి కుమారుడు తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు అతనికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. మతాల మధ్య‌ విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విశ్చిన్న రాజకీయాలు చేస్తున్న బీజేపీ పార్టీపై ఆ నాయకులు సైతం విశ్వాసం కోల్పోయారు. ఇలాంటి అభివృద్ధి నిరోదక పార్టీలకు తగిన బుద్ది చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని, మంత్రి కేటీఆర్ సహ‌కారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందుంచుతామన్నారు. రానున్న రోజుల్లో అన్ని పార్టీల నుండి టీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని, పార్టీలో చేరిన వారిని కాపాడుకుంటామన్నారు. టీఆర్ఎస్ అంటేనే తిరుగులేని రాజకీయ శక్తి అన్నారు. అబద్దాలు అసత్యాలు, విశ్చిన్నకర బీజేపీ పార్టీతో తెలంగాణకు ఒరిగేందేం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement