Sunday, May 9, 2021

విమలకు మదర్ తెరిసా జాతీయ మహిళ రత్న అవార్డు ..

తొర్రూరు, :డివిజన్ కేంద్రంలోని కస్తూరి భా పాఠశాలలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న తెలంగాణ షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు డా ధారవత్ విమలకు ఎన్జీఓస్ నెట్ వర్క్ సోజన్యంతో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జాతీయ మహిళ రత్న అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ లాక్ డౌన్ లో అందించిన సేవలను గుర్తిస్తూ ఇన్ని అవార్డులు రావడం ఎంతో సంతోషం గా ఉందన్నారు. ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవ కార్యక్రమలు చేయటానికి ఆత్మ విశ్వాసంతో, భాద్యతతో ముందుకు సాగుతానని, సేవలు ఉండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకే కార్యక్రమలు ఉంటాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మానవ హక్కుల కమిసనర్ ఛైర్మెన్ జస్టిస్ జి చంద్రయ్య, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్ర కుమార్ ,రచయితల సంఘ అధ్యక్షుడు కళా రత్న బిక్కి కృష్ణ, మెట్రో ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News