Wednesday, April 17, 2024

వరి ధాన్యం కొనేంతవరకు ఉద్యమిస్తాం

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నూగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె బోయిన బుచ్చయ్య అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో చేపట్టిన నిరసన దీక్షను ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టామన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వరుస కార్యక్రమాలతో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 7న రహదారుల దిగ్బంధం గ్రామగ్రామాన నల్లజెండాలు ఎగరవేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement