Monday, January 30, 2023

Breaking: కాళేశ్వరం వ‌ద్ద‌ గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

మహాదేవపూర్, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వ‌ద్ద‌ గోదావరి నదిలో ఇద్దరు యువకులు ఇవ్వాల మధ్యాహ్నం గల్లంతు అయ్యారు. హైదరాబాద్ రాంనగర్ కు చెందిన వినోద్, ప్రవీణ్ దుర్గ నవరాత్రుల సందర్బంగా దుర్గామాత నిమర్జనం కోసం కాళేశ్వరం వ‌చ్చారు. గోదావరి నదిలో స్నానం చేస్తున్న క్రమంలో వీరు నీటి ఉధృతికి గల్లంతు అయ్యారు. సమాచారం తెలుసుకున్న కాళేశ్వరం ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేప‌ట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement