Tuesday, November 29, 2022

ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ ఇద్ద‌రు ఆడిట్ అధికారులు..

తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఇద్ద‌రు ఆడిట్ అధికారులు లంచం తీసుకుంటూ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆడిట్‌ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆడిట్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ ఆడిటర్‌గా పనిచేస్తున్న జాటోత్‌ కిశోర్‌కుమార్‌ రూ.18వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

- Advertisement -
   

వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న సివిల్‌ కానిస్టేబుల్‌ పెన్షన్‌ డబ్బుల కోసం ఆడిట్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బాధితుడి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కార్యాలయంలోని అసిస్టెంట్‌ ఆడిటర్‌ జే.శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ జాటోత్‌ కిశోర్‌కుమార్‌ అనే అధికారులు బాధితుడి నుంచి రూ. 25వేలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం డబ్బులతో వచ్చిన బాధితుడు ఫోన్‌ చేయగా తాను అందుబాటులో లేనని ఆ డబ్బులను సీనియర్‌ అసిస్టెంట్‌ కు ఇవ్వాలని జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్ చెప్ప‌డంతో… సీనియర్‌ అధికారి కిశోర్‌కుమార్‌కు రూ.18వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement