Wednesday, November 29, 2023

మంత్రి సత్యవతిని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు

ములుగు జిల్లా పర్యటనకు వ‌చ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ను ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు. ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దు అని దళితులు నినాదాలు చేశారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మంత్రి సత్యవతి రాథోడ్ ల కాళ్లు పట్టుకొని దళితుల కోసం న్యాయం చేయాలని వేడుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాకు వచ్చి ఏమి చేసింది, ఉమ్మడి జిల్లా మంత్రులు అందరూ కలిసి ములుగు ఎమ్మెల్యే తో మీ రహస్య ఒప్పందాలు ఏమిటి… కార్యకర్తలకు వివరించాలి అని పట్టుబ‌ట్టారు. వర్షం సైతం లెక్క చెయ్యకుండా టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి సత్యవతి రాథోడ్ అడ్డుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement