Wednesday, April 17, 2024

టీఆర్ ఎస్ లోకి భారీ చేరికలు…

వరంగల్ : గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ నుండి దువ్వ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి సుమారు 100మంది కార్యకర్తలు ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని అన్నారు. తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement