Tuesday, April 23, 2024

ముగ్గురు దారిదోపిడి దొంగల అరెస్ట్..

వరంగల్ క్రైమ్ : వరంగల్లో దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును ఇంతేజార్ గంజ్ పోలీసులు బట్టబయలు చేశారు. వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్లకు వచ్చే ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ లూటీ చేస్తున్న కేటుగాళ్ల బాగోతాన్ని సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా దారి దోపిడీ దొంగల బండారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంతేజార్ గంజ్ ఇన్స్ పెక్టర్ దగ్గు మల్లేష్ కథనం ప్రకారం… వరంగల్ బస్టాండ్ సమీపంలో జనవరి 28న తెల్లవారు జామున 4 గంటలకు గాద సాయితేజ అను వ్యక్తి ఆటో కోసం ఎదురు చూస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకుని, చితకబాది రూ.9 వేల నగదును లాక్కొని వెళ్లారు.

ఈ సంఘటనపై బాధితుడు సాయితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో బాగంగా బస్టాండ్ ఏరియాలోని సీసీ టీవీ కెమెరాల దృశ్యాల ఆధారాలతో పాటు, సాంకేతికతను ఉపయోగించుకొని బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2వేల నగదుతో పాటు ఒక పల్సర్ బండిని స్వాధీనం చేసుకొన్నారు. కరీమాబాద్.బీరన్న కుంటకు చెందిన షేక్ సోయల్ (19), శివనగర్ కు చెందిన జంజాల కార్తీక్ (21), షేక్ ఖాజా (23) లైన ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్స్ పెక్టర్ దగ్గు మల్లేశ్, ఎస్సైలు నాగరాజు, శివ కానిస్టేబుళ్ళు శివ, ఉపేందర్ లను, ఏ ఏ ఓ సల్మాన్ ను వరంగల్ ఏసీపీ గిరికుమార్ కల్కోట అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement