Thursday, February 2, 2023

గర్ల్స్‌ హాస్టల్‌లో దొంగల హల్‌చల్‌.. ఇద్దరి అరెస్టు…

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఆనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో దొంగలు హల్ చ‌ల్ చేశారు. విద్యార్థులకు చెందిన‌ మూడు సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ చోరీ చేసి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఇద్ద‌రు నిందితులు హైదరాబాద్ కు చెందివారూగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement