Friday, January 21, 2022

తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరి – మాజీ మంత్రి డాక్టర్ విజయరామరావు

అసలు సిసలైన తెలంగాణ ఉద్యమ ద్రోహి కడియం శ్రీహరి అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ విజయరామరావు ఆరోపించారు. నిన్న హనుమకొండ నగరంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పేట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హనుమకొండ హంటర్ రోడ్ లో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో విజయరామారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ను మధు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారయణ, గురిజాల శ్రీరాంరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యల రవీందర్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు మేకల రాజవీరు, స్టేషన్ ఘనపూర్ నుండి ఎమ్మేల్యేగా పోటీచేసిన పెరుమండ్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News