Friday, November 29, 2024

WGL | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి పరిస్థితి విషమం

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement