Tuesday, May 30, 2023

దేవాలయాలే వారి టార్గెట్.. హుండీలోని న‌గ‌దు చోరీ..

వరంగల్ క్రైమ్ : దేవాలయాలనే టార్గెట్ గా చేసుకొని చోరీలు చేసే ముఠాలు బయలుదేరాయి. ఇండ్లలో చోరీలు చేయడం కష్టంగా మారడంతో ఏ బందోబస్తు లేని గుళ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నారు. వరంగల్ జిల్లాలోని ఖిల వరంగల్ గల తూర్పు కోటలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఖిల వరంగల్ తూర్పు కోటలోని పెద్దమ్మ ఆలయంలో రెండు హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకు పోయారు. అలాగే అమ్మవారిపై ఉన్న వెండి హారంను గుర్తు తెలియని ఆగంతకులు చోరీ చేసి ఉడాయించారు. వరంగల్ లో ఇటీవల కాలంలో దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement