Thursday, March 28, 2024

దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ.. ధర్మారెడ్డి

9ఏండ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా ఉందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని గీసుగొండ మండలం బొడ్డుచింతలపల్లి, గీసుగొండ, రాంపూర్, మనుగొండ, చంద్రయ్యపల్లి, కొనాయిమాకుల, అనంతారం గ్రామాల కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్‌ ఒక్కరితోనే సాధ్యమని, ఆయనే దేశానికి శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మోడీని నిలువరించే, దేశాన్ని రక్షించగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకంగా మారనున్నారన్నారు. కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ పాలనను, సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

అందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలన్నారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్యపు ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డుగా నిలుస్తుందని, వారికి వచ్చే రోజుల్లో ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్న బీజేపీ నాయకులను తెలంగాణకు ఏంచేసారో చెప్పాలని ప్రజలు నిలదీయాలన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ప్రతి గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు.


పల్లె ప్రగతి పథకంతో గ్రామాల అభివృద్ధికి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. కేసీఆర్ కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరగొని రాజుకుమార్, జడ్పీటిసి పోలీస్ ధర్మారావు, వైస్ ఎంపిపి రడం శ్రావ్య భరత్, మండల ప్రధాన కార్యదర్శి చల్లా వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ అంకతి నాగేశ్వర రావు, సర్పంచ్ బొడకుంట్ల ప్రకాష్, మాజీ ఎంపిపి ముంత కళావతి రాజయ్య యాదవ్, మండల రైతుబందు కన్వీనర్ బొమ్మినేని మాధవ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ గుర్రం రఘు, మార్కెట్ డైరెక్టర్ గోలి రాజయ్య, సర్పంచ్ డోలే రాధాబాయి చిన్ని, సర్పంచ్ గోనె మల్లారెడ్డి, మహిళ నాయకురాలు కొండ రాధ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, అధ్యక్ష కార్యదర్శులు, యూత్ నాయకులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement