Thursday, April 25, 2024

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా జిల్లాలోని షెడ్యూల్ కులాల యువతకు గ్రూప్స్, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను షెడ్యూల్డ్ కులాల యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షెడ్యూల్ కులాల యువతకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డితో కలిసి బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశంతో నిరుద్యోగ యువత లబ్ది పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి జె.సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… యువత పోలీస్ శాఖలో సక్సెస్ కావాలంటే తప్పకుండా క్రమశిక్షణ ముఖ్యమని, ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన నోటిఫికేషన్లు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఫలితం వస్తుందన్నారు. యువత పోలీసు కొలువులు, ఇతర పోటీ పరీక్షలకు అంకితభావం, అకుంఠిత దీక్ష తో సన్నద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి సునీత, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గౌరీ, ఫాకల్టీ సత్యనారాయణ చారి, భూపాలపల్లి సిఐ రాజిరెడ్డి, త‌దితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement