Wednesday, January 19, 2022

న‌ర్సింగ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

హనుమకొండ జిల్లా: వరంగల్ నగరంలోని రోహిణి ఆస్పత్రి హాస్టల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప‌డింది. హాస్టల్లోనే విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించిన యాజమాన్యం విద్యార్థినిని రోహిణి ఆసుపత్రికి తరలించింది. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్‌లో ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిణి ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News