Saturday, April 20, 2024

వీధి కుక్కల స్వైర విహారం.. ఏడుగురికి గాయాలు

గోవిందరావుపేట, మే 24 (ప్రభ‌ న్యూస్) : మండలంలోని చల్వాయి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులపై బుధవారం ఉదయం కుక్కలు దాడి చేయడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థ‌లానికి చేరుకున్న 108 ఈఎంటి నరేష్, పైలెట్ మార్కండేయలు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement