Thursday, April 25, 2024

నవీన్ రావుకు పిఆర్టీయు స‌త్కారం…

మరిపెడ, – ఎపిలో పిఆర్టియు మద్దతు ఇచ్చిన ఇద్దరు శాసన మండలి సభ్యులుగా గెలిచిన సందర్భంగా, తెలంగాణాలో ఉద్యోగ, ఉపాధ్యాయులలకు మంచి ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావును బీచురాజుపల్లిలోని ఆయన స్వగృహంలో మంగళవారం పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుడితి ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో ఉపాధ్యాయులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు న‌వీన్ రావుని దుశ్శాలువ‌తో స‌త్క‌రించారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్,మాజీ మండల శాఖ అధ్యక్షులువెర్మరెడ్డి నర్సిరెడ్డి,గుగులోత్ వెంకన్న, సంఘ బాధ్యులు కర్ణాకర్, రామ్మోహన్, ఆర్ వెంకన్న, నగేష్, వెంకన్న, ప్రేమ్ సాగర్, నెహ్రు యాదగిరి, మనోజ్, రవి, లెనిన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement