Thursday, June 8, 2023

ప్రోటోకాల్ రగడ.. బారాసా నాయ‌కుల నిర‌స‌న‌..

కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రోటోకాల్ ర‌గ‌డ నెల‌కొంది. డోర్నకల్ ఎమ్మెల్యే ఫొటో పెట్టలేదని డోర్నకల్ బారాసా నాయకులు నిరసన తెలిపిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. డైయస్ పై ప్రోటోకాల్ ప్రకారం డోర్నకల్ ఎమ్మెల్యే ఫ్లెక్స్ ఏర్పాటు చేయలేదని నిరసనగా స్టేజి ముందు బారాసా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేసముద్రం పాలక మండలి నిర్వాహకులు హుటాహుటిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఫ్లెక్స్ డైయస్ పై ఏర్పాటు చేయడంతో డోర్నకల్ నాయకులు నిరసన విరమించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement