Thursday, April 25, 2024

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విమర్శించారు. తెలంగాణ రైతుల నడ్డి విరిచేలా పాలన చేస్తుందని మండిపడ్డారు. ఆదివారం ఆయన మరిపెడ మండలంలోని తండ ధర్మారం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, అబ్బాయిపాలెం గ్రామంలో పీఎస్‌సీఎస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పండిన ధాన్యాన్ని తన బాధ్యతగా తీసుకొని రూ.3 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ ధాన్యాపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనమని చెప్పినా, సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు ఎటువంటి నష్టం జరకూడదని.. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని చెప్పారు. యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని సూచించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960/-, కామన్ గ్రేడ్ రూ.1940/లకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో రైస్ మిల్ల‌ర్లు కూడా ఇదే ధ‌ర‌కు కొనుగోలు చేయాల‌ని, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌తి రైతుకు త‌న స‌హాయ స‌కారాలు ఎప్ప‌టికి ఉంటాయ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement