Thursday, May 26, 2022

నాణ్యమైన వైద్యం అందడమే సీఎం కెసిఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

నాణ్యమైన వైద్యం అందడమే సీఎం కెసిఆర్ లక్ష్యం అని, అందుకు అనుగుణంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పటల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణాన్ని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. అలాగే, జిల్లాకు మెడికల్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్ కేటాయించడం పట్ల జిల్లా ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement