Tuesday, March 26, 2024

పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

పరకాల : ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పంట నష్టంపై క్యాబినెట్ లో చర్చించిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈరోజు పరకాల మండలంలోని నాగారం, మల్లక్కపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డిలు నాగారం గ్రామానికి చెందిన రైతు మాసబోయిన బాబు వర్షం దెబ్బతిన్న మిర్చి తోటను, మల్లక్కపేట గ్రామానికి చెందిన రైతు రసమల్ల రవి మిర్చి తోటను పరిశీలించారు. నష్ట పరిహారం అందిస్తామని రైతులకు హమీ ఇచ్చారు. మంత్రుల వెంట వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, జడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అధికారుల బృందం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సీఎంకు నివేదిక అందజేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement