Thursday, February 2, 2023

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

మంగపేట : ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింహ సాగర్ కు చెందిన కొంతమంది పశువుల కాపర్లు తమ పశువులను మేత కోసం గ్రామ శివారులోని ఆటవీ ప్రాంతనికి వెళ్లారు. అక్కడ ఒక చెట్టుకు సుమారు 30 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement