Friday, April 19, 2024

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు : చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

హన్మకొండ : రాష్ట్రంలో గణనీయంగా మత్స్య సంపదను పెంపొందింప చేసి మత్స్యకార కుటుంబాల జీవితాల్లో ప్ర‌భుత్వం వెలుగులు నిపింద‌ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలి బజార్ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భద్రకాళి తటాకంలో వదిలారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తదుపరి నిన్న వడ్డేపల్లి, ఈరోజు భద్రకాళి చెరువుల్లో అధికారికంగా మళ్ళీ చేపల పెంపకాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నూతన నీటి వనరుల విస్తీర్ణం భారీగా పెరగడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద కూడా భారీగా పెరిగిందని వివరించారు. సంపదను సృష్టించాలి.. దానిని పేదలకు పంచాలనే ఆలోచనల మేరకు రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదను ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి మత్స్యకారుడికి అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు చేపల పెంపకం కోసం మీరే డబ్బులు వెచ్చించి చేప పిల్లలు కొని తీసుకువచ్చి పెంపకం చేసేదని కానీ ఉద్యమ సమయంలో కుంటుపడ్డ కులవృత్తులను నిశితంగా గమనించిన ఆనాటి ఉద్యమ సారథి నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రంలోని అనేక చెరువుల మిషన్ కాకతీయ ద్వారా పూడికతీత తీసి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి,75% సబ్సిడీపై వ్యాపార వాహనాలను అందించి నేడు రాష్ట్రంలో గణనీయంగా మత్స్య సంపదను పెంపొందింప చేసి మత్స్యకార కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందన్నారు. భద్రకాళి చెరువులో నేడు 6లక్షల రూపాయలతో దాదాపు 4 లక్షల చేప పిల్లల వితరణ చేయడం వల్ల రాబోయే కాలంలో దాదాపు 2 కోట్ల రూపాయల ఆదాయం లభించనుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement