Friday, April 26, 2024

నేడు వరంగల్ లో కెటిఆర్ పర్యటన..

వరంగల్‌ నగర చరిత్రలోనే తొలిసారి 2176.99 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతు న్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా ఎన్నడూ ఇన్నటి నిధులు విడుదల కాలేదు. వరంగల్‌ మున్సిపాలిటీ కార్పోరేషన్‌, మహానగర పాలక సంస్థగా ఏర్పడిన తరువాత తొలిసారిగా రెండువేల కోట్ల రూపాయలకుపైగా ఒకేసారి అభి వృద్ధి పనుల జాతర జరుగుతోంది. రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి, యువనేత కల్వకుంట్ల తారక రామారా వు చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థా పనలు జరుగనున్నాయి. నగరంలోని వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్థన్నపేట నియోజ కవర్గాల పరిధిలో దాదాపుగా 55 కార్యక్రమాలలో మంత్రి కేటీఆర్‌ పాల్గొనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మంచినీటీ సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎంఎల్‌ఎ నన్నపునేన నరేందర్‌, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ అరూరి రమేష్‌, వరంగల్‌ ఎంపి పసునూరి దయాకర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను పర్యవేక్షణతోపాటు ఏర్పాట్లను పరిశీలించారు.
రూ. 1589 కోట్లతో ఇంటింటికి
మిషన్‌ భగీరథ నీళ్లు విడుదల
వరంగల్‌ నగర ప్రజలకు ఇచ్చిన ప్రధానమైన హామీలలో ఒకటైన ఉగాది నుంచి ఇంటింటికి మిషన్‌ భగీరథ నీటిని అందిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం వరంగల్‌ నగరంలోని వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన కాజీపేట మండలం రాంపూర్‌ గ్రామంలో 1589 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన మిషన్‌ భగీరథ మంచినీటిని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని దేశాయిపేటలో తూ ర్పు జర్నలిస్టులకు సంబంధించిన 200 రెండు పడకల గదుల ఇండ్లను 10కోట్ల 60లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసివాటికి శంకుస్థాపన చేయను న్నా రు. ఎస్‌ఆర్‌ నగర్‌లో 11.02 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన రెండు పడక గదుల ఇండ్లను ప్రారంభిస్తారు. వర్థన్నపేట నియోజకవర్గంలోని తిమ్మా పూర్‌, హసన్‌పర్తి, చింతగట్టులో రెండుపడకల ఇండ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు.
రెండు చోట్ల బహిరంగ సభలు
వరంగల్‌ తూర్పు నియోజకవర్గం, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో రెండు చోట్ల బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం వరంగల్‌ తూర్పులోని ఖిలావరంగల్‌లో బహిరంగ సభను నిర్వహిస్తుండగా వరంగల్‌ పశ్చిమలో న్యూ శాయంపేటలో మరో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. తర్వలో జరుగనున్న కార్పోరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో రెండు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement