Saturday, April 20, 2024

పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న ప్రేమ.. కేసీఆర్ కు మన రైతుల మీద లేదు : సీత‌క్క

ప‌క్క రాష్ట్రం రైతుల మీద ఉన్న ప్రేమ‌… కేసీఆర్ కు మ‌న రాష్ట్ర రైతుల మీద లేద‌ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అన్నారు. గోవిందా రావు పేట మండలంలోని చాల్వయి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించండి.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు కేసీఆర్ చేసిందేమీ లేద‌న్నారు. ఎన్నికల సమయంలో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా… రైతులకు ఎరువులు విత్తనాలు ఉచితంగా ఇస్తానని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వరి ఏస్తే ఉరి అనే పరిస్థితి తీసుకువచ్చార‌న్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యావుసం బాగుపడ్డ చరిత్ర లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు, ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటామ‌న్నారు. ధరలు ముందే నిర్ణయిస్తామ‌న్నారు. మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామ‌న్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామ‌ని, మెరుగైన పంటల భీమాను తీసుకోస్తామ‌న్నారు. రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామ‌న్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు ధరణి పోర్టలును రద్దు చేస్తామ‌న్నారు. మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామ‌న్నారు. నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు.. అమ్మే సంస్థలపై పీడీ యాక్టు, పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామ‌న్నారు. చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామ‌న్నారు. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్ట పర అధికారాలతో రైతు కమీషన్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.. ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలన్నారు. అసమర్థ బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని సీతక్క రైతులను ఉద్దేశించి అన్నారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసుపుతు సీతారాం నాయక్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంపాల ప్రభాకర్, ఎంపీటీసీ లు చాపల ఉమాదేవి, గుండ బోయిన నాగలక్ష్మి అనీల్, ఏడు కొండలు, మాజీ ఎంపీటీసీ సుది రెడ్డి జనార్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ తెళ్లహరిప్రసాద్, వెల్పుకొండ పూర్ణ, వెల్పుకోండ ప్రకాష్, మల్లారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ పాశం మాధవ రెడ్డి, పాలెం యాదగిరి, సదాశివ రెడ్డి,
పడిదల సాంబయ్య, జంపాల చంద్ర శేకర్, పొన్నం సాయి ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement