Thursday, April 25, 2024

కంటి వెలుగును విజ‌య‌వంతం చేయాలి : మంత్రి హ‌రీష్ రావు

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమం అమలు తీరుతెన్నులు పై పటిష్ఠ మైన ప్రణాళిక చేపట్టేందుకు ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొనగా హైదరాబాద్ నుండి చీఫ్ సెక్రటరీ శాంతకుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామ, మండల స్థాయి సమావేశాలు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీ లలో మైక్ ల ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి 15000 టీమ్స్ 100 రోజులపాటు 16533 కేంద్రాలలో నిర్విరామంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, గ్రామ పంచాయతీలో ప్రతి రోజూ 300మందికి పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షించిన వెంటనే అవసరం ఉన్నవారికి రీడింగ్ కళ్ళ జొడ్లు ఇవ్వాలన్నారు. పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ప్రతిరోజు ఒక్కొక్కరికి
1500రూలు. ఇస్తూ ఉచితంగా భోజన వసతి సౌకర్యం స్థానిక వసతి గృహాలలో కల్పించాలన్నారు. ప్రణాళిక ప్రధానమని, ఈ రోజు ఈ గ్రామంలో జరుగుతుందని తెలిసే విధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామపంచాయతీ లోను సంబంధిత రేషన్ షాపులలోను చార్టులను ఏర్పాటు చేసి ప్రదర్శింపచేయాలన్నారు… గ్రామపంచాయతీ లలో కంటివెలుగు బోర్డ్ లు ఏర్పాటు చేసి కంటి వెలుగు పరీక్షల తేదీలను ముందుగా ప్రదర్శింప చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ… ఈనెల 19వ తేదీన జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్నందున ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అందుకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత వైద్యాధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

జిల్లాలో 19వ తేదీ నుంచి కంటి వెలుగు ప్రారంభం కానుందని, జిల్లాలో ఆరు లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు, 461 గ్రామాలు 82 వార్డులలో ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు. ప్రభుత్వ భవనాలలోనే కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామ‌న్నారు. 38 బృందాలకు 40 వాహనాలు ఏర్పాటు, ప్రతి బృందంలో 8 మంది సిబ్బంది ఉంటార‌న్నారు. వైద్యాధికారి ఒకరు, ఆప్తాలమిస్ట్ ఒకరు, హెల్త్ సూపర్వైజర్ ఒకరు, పారామెడికల్, ఏఎన్ఎం ఇద్దరూ, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒకరు, ఆశా కార్యకర్తలిద్దరూ మొత్తంగా ఎనిమిది మంది టీంలో ఉంటారు. ప్రతి కేంద్రాన్ని మాఫ్ డ్రిల్ గా ట్రయల్ రన్ నిర్వహిస్తామ‌న్నారు. ఉదయం 9 గంటల నుండి ప్రారంభించే కంటి వైద్య పరీక్షలు ప్రతిరోజు 300 మంది కి నిర్వహిస్తామ‌న్నారు. జిల్లాకు రీడింగ్ కళ్ళజోడులు చేరాయి. ప్రిస్క్రిప్షన్ కళ్ళజోడు వారం నుండి పది రోజుల్లో అందజేస్తామ‌న్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జెడ్పి సీఈవో రమాదేవి జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ఉపవైద్యాధికారులు అంబరీష మురళీధర్ డాక్టర్ సుధీర్ బిందు శ్రీ డోర్నకల్ మరిపెడ తొర్రూరు మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి , కుమార్ లు మహబూబాబాద్ మున్సిపల్ డి ఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement