Saturday, September 30, 2023

పిస్తోలుతో కాల్చుకొని జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన జవాను కన్నెబోయిన రాములు(32) శుక్రవారం పంజాబ్‌లో పిస్తోలుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నెబోయిన రాజయ్య, కొమురమ్మ దంపతుల కుమారుడైన రాములు పదేళ్ల క్రితం సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్‌)లో చేరారు. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ ప్రాంతాల్లో పనిచేశారు. రెండు నెలల క్రితం ఆయన సొంతూరుకు వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను పంజాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడ రాములు ఆత్మహత్యకు పాల్పడినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహం శనివారం బేగంపేట విమానాశ్రయానికి రానున్నట్లు సమాచారం. రాములు ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement