Monday, April 15, 2024

ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో.. సెక్యూరిటీ గార్డులే వైద్యులు

జనగామ : జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు అందించాల్సిన వైద్యసేవలను సెక్యూరిటీ గార్డులు,
ఆయాలు అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసి 24గంటలు వైద్య సేవలను అందించడం కోసం అందుబాటులో వైద్యులను ఉంచాల్సిన ఆసుపత్రి సూపరిండెంట్ రాజకీయ కలపలో మునిగితేలి ఆసుపత్రిని సరిగ్గా పట్టించుకోకపోవడం లేదని పలువురు నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రోగులకు అత్యవసర సేవలు అందించే ఎమర్జెన్సీ వార్డు విభాగంలో డాక్టర్లు, నర్సులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఇది గురువారం జరిగిన సంఘటనతో ఆసుపత్రి పనితీరు బయటపడింది..


అవస్థలు పడుతున్న పేషెంట్లు..
జనగామ పట్టణంలోని ఎసిరెడ్డి నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన బొల్లం దాసు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో గురువారం రాత్రి 10గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ డాక్టర్లు, సిస్టర్లు ఎవరూ అందుబాటులో లేరు. ఎమర్జెన్సీ విభాగంలో పట్టించుకునే నాధుడే లేకుండా పేషెంట్లు అవస్థలు పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు. గత్యంతరం లేక అక్కడున్న సెక్యూరిటీ గార్డులే ఈసీజీ టెక్నీషియన్లుగా, డాక్టర్లుగా పరీక్షలు నిర్వహిస్తూ సెలైన్లు ఎక్కిస్తున్నారు. ఆయాలే సూదులు మందులు అందించాల్సిన దయనీయమైన పరిస్థితి జనగామ జిల్లా ఆస్పత్రిలో దాపురించింది. దీంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లే రోగులకు సెలైన్లు అమర్చుతూ, ఇంజెక్షన్లు వేస్తున్న దృశ్యాలు గురువారం రాత్రి జరిగిన సంఘటనతో బయట పడింది..ఈ విషయం తెలిసినా వైద్యాధికారులు ఏమీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


గతంలో విస్మయానికి గురైన మంత్రి హరీష్ రావు..
గతంలో జనగామ ఆస్పత్రి సందర్శనకు వచ్చిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు సిగరెట్ పత్తా మీద మందుల చీటీ ఉంటే విస్మయానికి గురైన మంత్రి.. ఈ విషయంపై మంత్రి చర్యలు చేపట్టినా తీరు మారలేదు. ఇప్పటికైనా వైద్యశాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్, ఉన్నాతాధికారులు ఏమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement