Wednesday, March 27, 2024

రౌడీయిజం చేస్తే తాట తీస్తాం… సీఐ రమేష్ వార్నింగ్

వరంగల్ క్రైమ్ : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లో పాల్గొంటే తాట తీస్తామని మట్టేవాడ ఇన్ స్పెక్ట‌ర్ చిలువేరు రమేష్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీయిజం చేసిన, భూ వివాహదాల్లో తలదూర్చిన సహించబోమని హెచ్చరించారు. ఎటువంటి తగాదాలు, మరెలాంటి కుటుంబ పంచాయితీల్లోకి వెళ్లి జబర్దస్తూ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. రౌడీయిజం మానుకొని, కుటుంబంతో స‌త్ర్పవర్తనతో మెలగాలని సూచించారు. మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని మట్టేవాడ సీఐ చిలువేరు రమేష్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ ఇచ్చిన వారిలో ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement