Thursday, April 25, 2024

అండర్ రైల్వే గేట్ లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

కరీమాబాద్ – నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి పలుచోట్ల హోలీ పండగ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు అండర్ రైల్వే గేట్ లోని శివనగర్ ,పెరుక వాడ, కిలా వరంగల్ ఆల్, శాంతినగర్, కరీమాబాద్, ఉరుసులో చిన్నారులు మొదలుకొని పెద్దవారి వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు, రంగుల హరివిల్లు లో ఆడ, మగ తేడా లేకుండా మునిగిపోయారు నగరంలోని పలు డివిజన్లలో వీధులన్నీ రంగుల మయమయ్యాయి, వివిధ రకాలరంగులు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనంద డోలికల్లో తేలియాడరు,
22వ డివిజన్ గడ్డం ఆధ్వర్యంలో
,
22 వ డివిజన్ లో టిఆర్ఎస్ నాయకులు గడ్డం యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో హోలీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని మిఠాయి పంపిణీ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కందికొండ రమేష్ ,అశోక్, ఆనంద్, రాజు, నాగేశ్వర్ ,కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement