Wednesday, March 27, 2024

హాఫ్‌ మారథాన్‌.. ఫుల్‌ జోష్‌..

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియం వేదికగా నిర్వహించిన హాఫ్‌ మారథాన్ రన్ -2023 సెకండ్ ఎడిషన్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ రన్ లో దాదాపు 700 మంది వయస్సుతో సంబంధం లేకుండా యువతి, యువకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు, సిబ్బంది, చిన్నారులు 5K,10K,21.1Kలో రన్ లో పాల్గొన్నారు. అనంతరం 21k, 10k, 5k విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువత తో జుంబ డాన్స్ తో కేరింతలు పుట్టించారు.

రన్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం..
మనిషి జీవితంలో ఎన్నో మార్పులు వస్తున్న వేళ, జీవన ప్రమాణాలతో పాటు ఆహార ఆరోగ్య అలవాట్ల వస్తున్న మార్పులతో ఈ బిజీ ప్రపంచంలో మనిషికి కావాల్సిన శారీరక శ్రమ లేక ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రజలలో అందుకు కావాల్సిన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి రన్ నిర్వహించడం జరిగిందని భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, వారి సతీమణి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా భారాస పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి అన్నారు. గత సంవత్సరం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసి మళ్ళీ తిరిగి 2023లో నేడు ఈ రన్ నిర్వహించడం జరిగిందని గత సంవత్సరంతో పోలిస్తే ఈ రన్ కు మరింత ఆదరణ పెరిగిందన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి: కలెక్టర్
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి మనిషి వయస్సుతో సంబంధం లేకుండా ఉదయం పరిగెత్తినట్లయితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సింగరేణి.టి యెస్ జెన్ కో.పోలీస్.డిపార్ట్మెంట్ వారు జిల్లా కేంద్రం లో ఉన్నటువంటి యువతీ యువకులు వయసుతో సంభందం లేకుండా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేను ఈ కార్యక్రమంలో ఈ వేదిక మీద రెండవ సారి పాల్గొనడం జరిగింది అని 30 నిమిషాల వ్యవధిలో 5 కిలోమీటర్లు పరిగెత్తడం ఆనందంగా ఉందని నాతో పాటు సమానంగా పరుగెత్తిన సింగరేణి కార్మికుడు 65ఏళ్ల వయస్సు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లాకు చెందిన బ్రంమేశ్వర్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, జెన్ కో, సింగరేణిసిబ్బంది పార్టీ కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement