Thursday, April 18, 2024

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎంపీ ద‌యాక‌ర్‌

ప్రభుత్వ వైద్య శాలలు పటిష్టం చేయడం లో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలకు అన్ని వసతులు కల్పించి ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సంబంధిత వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ గోపి ఆదేశించారు.
గురువారం బల్దియా పరిధి 27వ డివిజన్ పాత గ్రైన్ మార్కెట్ ప్రాంతం లోగల ప్రభుత్వ ఆయుర్వేద బోధన వైద్య కళాశాల యందు ఎమ్మెల్సీ నిధులతో మహిళలు, పురుషుల సౌకర్యార్థం వేరు వేరు గా ఏర్పాటు చేసిన 80 పడకల విభాగాలను, వరంగల్ కలెక్టర్ కేటాయించిన నిధులతో ఏర్పాటు చేసిన ఆర్.ఓ.ప్లాంట్ ను పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్ లతో కలిసి సంయుక్తంగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి విద్య వైద్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వరంగల్ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో గతంలో క్షేత్రస్థాయిలో ఆసుపత్రిని పరిశీలించి సంబంధిత వైద్యాధికారులు సూపరింటెండెంట్ తో సంప్రదించడం జరిగింది అని ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో మూడు వార్డులలో బెడ్స్ అందించడం జరిగిందని ఆవార్డ్స్ ను ఈరోజు ప్రారంభించడం జరిగిందని అలాగే జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రజలు ఆయుర్వేదిక్ వైద్యంపై కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఆయుర్వేదిక్ వైద్యశాలలో డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి అన్ని విధానాల ద్వారా చికిత్సలు అందిస్తున్నారని హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు.

స్థానిక శాసన సభ్యులు నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా ను ప్రగతి పథంలో నడిపించడం కొరకు కావలసిన అన్ని సదుపాయాలపై స్థానిక జిల్లా పాలనాధికారి వారితో వివిధ సమావేశాల ద్వారా సంప్రదించు కొన్ని స్థానిక కార్పొరేటర్లు జిల్లా అధికారులను ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నామని, ఈరోజు వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ కు వసతులను ప్రారంభించనున్నామని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో అగ్రగామి తెలంగాణ రాష్ట్రం అని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో విస్తరిస్తున్నాయి అని చెప్పారు. గతంలో వరంగల్ ఆయుర్వేదిక్ వైద్యశాలలో బోర్ మోటార్ ఏర్పాటు చేయాలని వైద్యుల విజ్ఞప్తి మేరకు బోరు మోటర్ ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాలను గతంలో సందర్శించడం జరిగింది అని ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యుల విజ్ఞప్తి మేరకు వెంటనే చర్యలు తీసుకుని కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ వైద్య సేవలపై వైద్య అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్ణయించుకొని రోగుల పట్ల సమన్వయంతో వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వ్యాధులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుకో వలసినదిగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, రాష్ట్ర సరోగసి బోర్డ్ సభ్యురాలు హరి రమాదేవి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డా. రవి నాయక్, సూపరిండెంట్ డా. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement